: హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్... ఛత్తీస్ గఢ్ కలెక్టర్ ఆదేశాలు


ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోలు పోయాలని, లేని పక్షంలో పెట్రోలు పోయొద్దని పెట్రోలు బంకుల యజమానులకు ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ జిల్లా కలెక్టర్ పి.అన్బళగన్ ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వాలు చైతన్యం తీసుకువస్తున్నప్పటికీ ఉపయోగం ఉండడం లేదు. దీంతో ఈ పద్ధతిని మార్చాలని ఆలోచించిన బిలాస్ పూర్ జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన ఆయన, ఆదేశాలు పాటించని పెట్రోలు బంకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2013 గణాంకాల ప్రకారం ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇకపై అలాంటి ఘటనలు చోటుచేసుకోకూడదని ఈ ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News