: మహిమ గల చెంబు అని చెప్పి మహిళను మోసగించారు


మహిమగల చెంబు అని చెప్పి ఒక మహిళను మోసం చేసిన నిందితులు లక్షలాది రూపాయలు కాజేశారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా ఎస్.కోటలో ఈరోజు జరిగింది. ఒక మహిమ గల చెంబు తమ దగ్గర ఉందని, దానిని ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వచ్చి పడతాయనే మాయమాటలతో నలుగురు వ్యక్తులు ఒక మహిళను నమ్మించి సుమారు రూ.15 లక్షలు కాజేశారు. అది మహిమ గల చెంబుకాదనే విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News