: ‘బాహుబలి’కి జాతీయ అవార్డుపై వ‌ర్మ కామెంట్


భారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టిన తెలుగు చిత్రం ‘బాహుబలి’.. కొద్దిసేపటి క్రితం కేంద్రం ప్రకటించిన 63వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ చలన చిత్రంగా నిలిచిన విష‌యం తెలిసిందే. 2015 సంవత్సరానికిగాను జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. దీనిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ ‘బాహుబలి’ చిత్రానికి జాతీయ అవార్డు రాలేదని, జాతీయ అవార్డే బాహుబలి వద్దకు వచ్చిందని ఆయ‌న ట్వీట్ చేశారు. బాహుబలికి అవార్డు దక్కినందుకు నేషనల్‌ అవార్డ్స్‌ కమిటీలోని జ్యూరీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలని వర్మ తెలిపాడు. నేషనల్‌ అవార్డ్స్‌ కమిటీ బాహుబలిని గెలుచుకోవడం సంతోషంగా ఉందని, అదేవిధంగా బాహుబలి-2 కూడా కమిటీ సభ్యులను అనుగ్రహించాలని దేవుణ్ని కోరుకుంటున్న‌ట్లు ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News