: రూ. 500 కోసం నదిలో దూకిన నిరుద్యోగి!


ఇండియాలో నిరుద్యోగులు కడుపు నింపుకునేందుకు ఎలాంటి కష్టాలు పడుతున్నారో తెలిపే మరో ఘటన ఇది. కేవలం రూ. 500 కోసం సబర్మతీ నదిలోకి దూకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి ఉదంతమిది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నేపాల్ నుంచి గుజరాత్ రాష్ట్రానికి వలస వచ్చిన దిబేష్ ఖనాల్ (41) అనే వ్యక్తి రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతనికి డబ్బు అత్యవసరమైన వేళ, స్నేహితుడు సాగర్ థాపా సహాయాన్ని కోరాడు. రూ. 500 ఇస్తానని, అయితే, సబర్మతీ నదిని ఈదాలని సాగర్ షరతు పెట్టగా, సరేనని చెప్పి దూకేశాడు. కొద్ది మీటర్ల దూరం వెళ్లేసరికే తనవల్ల కాదని కేకలు పెడుతుండగా, ఆ ప్రాంతంలోనే ఉన్న రెస్క్యూటీం ఖనాల్ ను కాపాడింది. "నా కుమారుడు చదువుకుంటున్నాడు. అతని ఫీజుల నిమిత్తం డబ్బు కావాలి. అందుకనే ఈ పందానికి ఒప్పుకున్నాను. అయితే, మధ్యలోనే నా వల్ల కాదని తెలిసిపోయింది" అని తన దీన గాధను చెప్పుకొచ్చాడు. పోలీసులు వచ్చేసరికి పందెం కాసిన సాగర్ పారిపోగా, ఖనాల్ బీఎస్సీ వరకూ చదువుకున్నాడని తెలుసుకున్న పోలీసులు, అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

  • Loading...

More Telugu News