: పార్టీ మారాలనుకుంటే నేరుగా చంద్రబాబునే కలిసేవాడిని: జ్యోతుల నెహ్రూ
పార్టీ మారే విషయమై తానింకా ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. తాను పార్టీ మారాలనుకుంటే ఎవరితోనూ చర్చించక్కర్లేదని, నేరుగా చంద్రబాబునాయుడినే కలవగలనని అన్నారు. కాగా, నిన్న జ్యోతుల, వరుపుల సుబ్బారావు కలసి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మరోవైపు మరిన్ని ఫిరాయింపులను ఆపేందుకు వైకాపా అధినేత జగన్ సైతం తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.