: పఠాన్ కోట్ దాడి: నేటి నుంచి భారత్‌లో పాక్ బృందం దర్యాప్తు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఎన్‌ఐఏ) అధికారులతో ఈ రోజు పాకిస్థాన్ బృందం భేటీ కానుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ దాడి ఘటనపై పాక్ బృందం దర్యాప్తు చేపట్టనుంది. ఈ ఏడాది జనవరి2న జరిగిన పఠాన్ కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రదాడి ఉదంతంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల పాకిస్థాన్ బృందం ఇప్పటికే భారత్ చేరుకుంది. పాకిస్థానీ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జేఐటీ)కి ఏడు రోజులకుగానూ భారత్‌నుంచి వీసాలు మంజూరైన విషయం తెలిసిందే.