: ముంబైలో హైదరాబాద్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
హైదరాబాద్ నుంచి ముంబైకి ఈ ఉదయం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదకర పరిస్థితుల మధ్య ల్యాండయింది. ఉదయం 6 గంటల తరువాత 120 మంది ప్రయాణికులతో ముంబైకి బయలుదేరిన విమానం ఏఐ 620లోని అండర్ క్యారేజ్ లో పొగ వస్తుండటాన్ని గమనించిన పైలట్ సమాచారాన్ని ముంబై ఎయిర్ ట్రాఫిక్ అధికారులకు తెలిపారు. అప్పటికే విమానం ముంబైకి సమీపంగా ఉండటం, దగ్గర్లో మరో విమానాశ్రయం లేకపోవడంతో, అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించారు. రన్ వేపై దిగుతూనే విమానం టైర్ ఒకటి పేలిపోయింది. దీంతో తీవ్ర కుదుపులతో విమానం ఆగింది. ప్రయాణికులందరూ క్షేమమేనని అధికారులు తెలిపారు.