: ధోనీ సేనకు ప్రధాని ప్రశంసలు!...కోహ్లీని ప్రత్యేకంగా అభినందించిన మోదీ!
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో టైటిల్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో సత్తా చాటిన ధోనీ సేనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. నిన్న మొహాలీ కేంద్రంగా జరిగిన రసవత్తర మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ధోనీ సేన నేరుగా సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన వెంటనే ధోనీ సేనకు అభినందనలు తెలుపుతూ మోదీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. విజయం సాధించి సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ సేనకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.