: టీమిండియా లక్ష్యం 161
టీ20 ప్రపంచకప్ లో భారత్ పై తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ స్కోరు బోర్డు: ఖవాజా(26), ఫించ్(43), వార్నర్(6), స్మిత్(2), మ్యాక్స్ వెల్(31), ఫాల్కనర్ 10 పరుగులు చేశారు. వాట్సన్ 18, నెవిల్ 10 పరుగులతో నాటవుట్ గా నిలిచారు. కాగా, టీమిండియా బౌలర్లు ఎవరెన్ని వికెట్లు తీసుకున్నారంటే.. పాండ్యా రెండు వికెట్లు తీసుకోగా, నెహ్రా, బుమ్రా, అశ్విన్, యువరాజ్ సింగ్ లు తలా ఒక్కొక్క వికెటు తీసుకున్నారు. రవీంద్ర జడేజా మాత్రం ఒక్క వికెట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు.