: మహిళల టీ20: విండీస్ చేతిలో భారత్ ఓటమి
మహిళల టీ20 ప్రపంచకప్ లో ఈ రోజు వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమి చవిచూసింది. అంతకుముందు, భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో విండీస్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి వెస్టిండీస్ జట్టు 114 పరుగులు చేసింది. కాగా, లక్ష్యం ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 111/9 తో ఓటమి పాలైంది. దీంతో, టీ20 ప్రపంచ కప్ నుంచి భారత్ మహిళల జట్టు వైదొలగాల్సి వచ్చింది.