: 'లవ్యూ పవర్ స్టార్' అంటున్న సమంతా!


టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు యువనటుడు నితిన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ను అనుసరించడంతో ఓ అడుగు ముందుండే నితిన్...'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ లో పవన్ కల్యాణ్ ఎలా చెక్క గుర్రం మీద కూర్చుని ఆడుకున్నాడో అచ్చం అలాగే ఆడుకుంటూ 'ఆ...ఆ' సినిమా సెట్ లో సందడి చేశాడు. మరో విశేషం ఏమిటంటే, ఆ చెక్క గుర్రం మీద నితిన్ ను ఆడిస్తూ సినీ నటి సమంత 'లవ్యూ పవర్ స్టార్' అంటూ పవన్ కల్యాణ్ మీద ప్రేమను వ్యక్తం చేసింది. ఈ సందడిని వీడియో తీసిన నితిన్ దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా, 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన సమంత నటించగా, నితిన్ ఆ సినిమా హక్కులు తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News