: లక్ష్య సాధనలో తడబడుతున్న బంగ్లాదేశ్...ఫీల్డింగ్ లో ఆకట్టుకున్న కివీస్


కోల్ కతా వేదికగా న్యూజిలాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ విద్యుత్ అంతరాయం కారణంగా ఆగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ను బంగ్లాదేశ్ ఆటగాళ్లు 145 పరుగులకే కట్టడి చేశారు. ఓపెనర్ నికోలస్ (7) ను త్వరగా పెవిలియన్ బాటపట్టించినప్పటికీ విలియమ్సన్ (42), మున్రో (35), రాస్ టేలర్ (28) ను అవుట్ చేయడంలో ఇబ్బంది పడింది. వీరు పెవిలియన్ చేరిన కాసేపటికే కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆటగాళ్లు 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. 146 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు తడబడ్డారు. తమీమ్ ఇక్బాల్ (3) అద్భుతమైన ఫీల్డింగ్ కు రనౌట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మహ్మద్ మిథున్ (11) కు షబ్బిర్ రెహ్మాన్ (12) జత కలిశాడు. వీరిద్దరూ నిలదొక్కుకుంటున్నట్టే కనబడ్డారు. వీరు త్వరగా పెవిలియన్ చేరడంతో షకిబల్ హసన్ (2), సౌమ్య సర్కార్ (6), ముష్ఫికర్ రహీం (0) అవుటయ్యారు. దీంతో మహ్మదుల్లా (4), షవగత హోం (1) క్రీజులో ఉన్నారు. దీంతో 11 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 45 పరుగులు చేసింది. ఈ దశలో ఫ్లడ్ లైట్ లు వేడెక్కి ఆగిపోవడంతో వెలుతురు సరిపోవడం లేదని మ్యాచ్ ఆపారు. తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News