: యూపీలో భారీ అగ్నిప్రమాదం.. 100 దుకాణాలు దగ్ధం
ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాన్పూర్ జిల్లాలోని ఓ పరేడ్ బజార్‌లో మంటలు చెలరేగడంతో 100 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దాదాపు 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం అంచనా వివరాలు తెలియాల్సి ఉంది.