: ఆనంద గజపతిరాజు మృతికి చంద్రబాబు సంతాపం
విజయనగర రాజవంశానికి చెందిన పూసపాటి ఆనంద గజపతిరాజు మృతి వార్త తెలుసుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అనారోగ్యం కారణంగా విశాఖలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆనంద గజపతిరాజు నేటి ఉదయం గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు ఆనంద గజపతిరాజు మృతికి సంతాపం తెలిపారు. ఈ మేరకు సీఎంఓ కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కూడా ఆనంద గజపతిరాజు మృతికి సంతాపం ప్రకటించారు.