: సోదరుడి మృతితో కుంగిన అశోక్... ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు పయనం
సోదరుడు పూసపాటి ఆనంద గజపతిరాజు మరణ వార్త టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన సోదరుడి మరణ వార్త తెలియగానే హుటాహుటిన ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరారు. అభినవ ఆంధ్రభోజుడిగా పేరుగాంచిన ఆనంద గజపతిరాజు నేటి ఉదయం అనారోగ్యంతో మణిపాల్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.