: ఎదురెదురుగా అసెంబ్లీ, హైకోర్టు... నదీ అభిముఖంగా గవర్నర్, సీఎం నివాసాలు


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఏఏ భవనాలు ఎక్కడెక్కడ ఏర్పాటు కానున్నాయన్న విషయం ఖరారైపోయింది. జపాన్ సంస్థ ‘మాకీ’ రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న ఆమోద ముద్ర వేశారు. ఈ ప్లాన్ ప్రకారం అమరావతిలో కొత్తగా నిర్మితం కానున్న చట్ట సభ అసెంబ్లీ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు భవనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఏర్పాటు కానున్నాయి. ఇక నూతన రాజధానిలో కీలక భవనాలైన గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్, సీఎం అధికారిక నివాసాలు కృష్ణా నదికి అభిముఖంగా కొలువుదీరనున్నాయి. మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మితం కానున్న అమరావతి కీలక భవనాల్లో రాజ్ భవన్, సీఎం నివాసం ఒకే బ్లాకులో ఏర్పాటు కానున్నాయి. వీటిలో కుడివైపున రాజ్ భవన్ ఉంటే, ఎడమ వైపున సీఎం అధికారిక నివాసం ఉండేలా డిజైన్ రూపొందింది. రాష్ట్ర పాలనలో రెండు కీలక కేంద్రాలుగా ఉండనున్న ఈ రెండు నిర్మాణాలు కృష్ణా నది ఒడ్డున తొలి నిర్మాణాలుగా ఏర్పాటు కానున్నాయి. ఇక ఈ రెండు నిర్మాణాల మధ్యన సువిశాల విస్తీర్ణంలో ‘పబ్లిక్ ప్లాజా’ పేరిట పెద్ద పార్కు ఏర్పాటు కానుంది.

  • Loading...

More Telugu News