: ఆటో ఎక్కి రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లిన సంజయ్ దత్!
బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ లో జైలు జీవితం పెను మార్పులు తీసుకొచ్చినట్టు కనబడుతోంది. సంజూబాబా అంటూ ముద్దుగా పిలుచుకునే సంజయ్ దత్ జైలుకు వెళ్లక ముందు విలాసవంతమైన లైఫ్ స్టైల్ చవిచూశాడు. బాలీవుడ్ అగ్ర జంట సునీల్ దత్, నర్గీస్ ముద్దుల బిడ్డగా జన్మించిన సంజయ్ దత్ సినీ రంగంలో స్టార్ హోదాను అనుభవించాడు. సినిమా షూటింగులో తప్ప ఎప్పుడూ ఆటోలు ఎక్కాల్సిన అవసరం ఆయనకు రాలేదు. అందుకే ఆయన బయట ఆటో ఎక్కిన సందర్భం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ హోటల్ నుంచి ఆటోలో ఇంటికి చేరుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బుధవారం రాత్రి ముంబైలోని బాంద్రలోని కుర్లా కాంప్లెక్స్ లోని ఓ రెస్టారెంట్ కు భార్య మాన్యత, స్నేహితులతో కలిసి వెళ్లిన సంజయ్ దత్, అక్కడ భోజనం ముగిసిన తరువాత కారు కోసం ఎదురుచూడలేదు. అటుగా వెళ్తున్న ఆటోను ఆపి స్నేహితుడితో కలిసి దానిలో ఇంటికి చేరుకున్నాడు. ఆటో డ్రైవర్ 146 రూపాయలు ఛార్జ్ అయిందని చెప్పడంతో 300 రూపాయలు అతనికి ఇచ్చాడు. ఆటో డ్రైవర్ కు సంజయ్ దత్ స్నేహితుడు మరో వంద రూపాయలు ఇచ్చాడు. సంజయ్ దత్ కు రోల్స్ రాయిస్ వంటి పలు కార్లు ఉన్నాయి. అయితే, జైలు జీవితం సంజయ్ దత్ లో ఇలాంటి మార్పు తీసుకొచ్చింది మరి!