: సినీ నటి పెన్ డ్రైవ్ కోసం పోలీసుల హడావుడి!
హైదరాబాదు, ఫిలింనగర్ లో నివసించే సినీ నటి (క్యారెక్టర్ ఆర్టిస్ట్) రాధా ప్రశాంతికి దిల్ షుక్ నగర్ కు చెందిన ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ జగదీష్ రెండు వారాల క్రితం పరిచయమయ్యాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. అయితే, ఆ తరువాత వారం రోజులుగా ఆమెకు జగదీష్ కనపడకుండాపోయాడు. దీంతో మూడు రోజుల క్రితం జూబ్లిహిల్స్ పోలీసులను ఆశ్రయించిన రాధా ప్రశాంతి తన పెన్ డ్రైవ్ పోయిందని, దానిని జగదీశ్ దొంగిలించాడని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నలుగురు క్రైం పోలీసులతో ఓ టీంను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు జగదీష్ ఇంటి వద్ద రేయింబవళ్లు కాపలా కాసిన పోలీసులు ఎట్టకేలకు ఆయనను పట్టుకుని పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. తీరా చూస్తే, ఆ పెన్ డ్రైవ్ ను తాను దొంగిలించలేదని జగదీష్ స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.