: వివో నుంచి 'వై31ఎల్‌' పేరుతో న్యూ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ విడుదల


ఈ నెల ప్రారంభంలో 6జీబీ రామ్‌తో 'వివో ఎక్స్‌ప్లే5 ఎలైట్' పేరుతో స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసిన ప్ర‌ముఖ‌ మొబైల్‌ తయారీ సంస్థ వివో.. తాజాగా భార‌త మార్కెట్లోకి మ‌రో స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై31ఎల్‌ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. నలుపు, తెలుపు రంగుల్లో ల‌భిస్తోన్న ఈ ఫోన్ ధ‌ర రూ. 9,450. వై31ఎల్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయ‌ల్ సిమ్ స‌పోర్టు చేస్తుంది. వివో.. వై31ఎల్ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు.. 4.7 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్, 1.2 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్, 1 జీబీ రామ్, 16జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 8 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా.

  • Loading...

More Telugu News