: పాకిస్థాన్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన ఆసీస్


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పాక్ కు ఆసీస్ 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ కు ఖ్వాజా (21), ఫించ్ (15) శుభారంభం ఇచ్చారు. అనంతరం వార్నర్ (9) విఫలం కావడంతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (61) ఆచితూచి ఆడాడు. మ్యాక్స్ వెల్ (30) జోరుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. అనంతరం వచ్చిన షేన్ వాట్సన్ (44) బ్యాటు ఝుళిపించాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో అర్ధసెంచరీకి చేరువలోకి వచ్చాడు. వాట్సన్ ధాటిగా ఆడడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో వాహబ్ రియాజ్, ఇమాద్ వాసిం చెరో రెండు వికెట్లు తీసి రాణించారు. 194 పరుగుల విజయలక్ష్యంతో పాక్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి రెండు ఓవర్లు ముగిసేసరికి పాక్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 14 పరుగులు చేసింది. షెర్జిల్ (13), షెహజాద్ (0) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News