: కేజ్రీవాల్‌కు మ‌రో అరుదైన ఘ‌న‌త.. ప్ర‌పంచ‌ గొప్ప నేతల జాబితాలో ఢిల్లీ సీఎం


ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ మ్యాగజైన్.. 50 మందితో రూపొందించిన ప్రపంచ గొప్ప నేతల జాబితాలో కేజ్రీవాల్‌ చోటు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన 50మంది గొప్ప వ్యక్తుల జాబితాలో కేజ్రీవాల్‌ 42వ స్థానంలో నిలిచి, భారత ప్రధాని నరేంద్రమోదీకి కూడా ద‌క్క‌ని ఘ‌న‌తను సొంతం చేసుకున్నారు. ఇందులో అమెజాన్‌ సీఈవో జోఫ్‌ బెబోస్‌ మొదటి స్థానంలో ఉన్నారు. బిజినెస్‌, గవర్నమెంట్‌, ఫిలాంథ్రపీ, ఆర్ట్స్‌ రంగాలనుంచి వీరిని ఎంపిక చేశారు. ఈ ఏడాది ఈ జాబితాలో స్థానం సాధించిన ఏకైక ఇండియ‌న్ కేజ్రీవాల్. ఢిల్లీలో వాహనాల వాడకం తగ్గించేలా సరి-బేసి విధానాన్ని అమలులోకి తెచ్చి కాలుష్యాన్ని దాదాపు 13శాతం తగ్గించినందుకుగాను.. కేజ్రీవాల్‌ను ఎంపిక చేసినట్లు ఫార్చ్యూన్‌ మేగజైన్‌ తెలిపింది. కాగా.. ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ 2, మయన్మార్‌ నేత ఆంగ్‌ శాన్‌ సూకీ 3, పోప్‌ ఫ్రాన్సిస్‌ 4, యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ 5వ స్థానంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News