: ముగింపు సభపై బాబు చర్చలు.. కుటుంబ సభ్యుల భేటీ
చంద్రబాబు చేస్తున్న సుదీర్ఘ పాదయాత్ర 'వస్తున్నా మీకోసం' ముగింపుకొచ్చింది. ఇక మిగిలింది ఒకే రోజు. శనివారం సాయంత్రం విశాఖ శివార్లలో చంద్రబాబు యాత్రను ముగించనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద గొల్లలపాలెంలో ఉన్న చంద్రబాబుతో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు తదితరులు సమావేశమై ముగింపు సభ ఏర్పాట్లపై చర్చించారు. మరోవైపు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ కూడా చంద్రబాబును కలుసుకున్నారు.