: విద్యార్థి తలపై పగిలిన బీర్ బాటిల్!... విశాఖ 'నరవ' ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత


విశాఖలోని నరవ ఇంజినీరింగ్ కళాశాలలో నేటి ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాలకు చెందిన విద్యార్థి సతీశ్, హాస్టల్ వార్డెన్ జగన్మోహన్ ల మధ్య నెలకొన్న చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఏటీఎం విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన వార్డెన్ విద్యార్థి తలపై బీరు బాటిల్ తో దాడి చేశాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని ఆసుపత్రికి తరలించిన సహ విద్యార్థులు వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News