: చిక్కడపల్లి ఆంధ్రాబ్యాంకుకు దొంగల కన్నం.. చోరీ అయిన మొత్తంపై అధికారుల మల్లగుల్లాలు


హైదరాబాదులో మరో బ్యాంకుకు దొంగలు కన్నమేశారు. బ్యాంకు గోడకు కన్నమేసిన దొంగలు చేతికందిన మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, దొంగలు పట్టుకెళ్లిన మొత్తమెంత? అన్న విషయంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వివరాల్లోకెళితే... చిక్కడపల్లి పరిధిలోని ఆంధ్రాబ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకు గోడకు దొంగలు వేసిన కన్నాన్ని చూసిన అధికారులు షాక్ తిన్నారు. ఉదయాన్నే తలుపులు తీసుకుని బ్యాంకులోకి వెళ్లిన అధికారులు చోరీ జరిగిందని నిర్ధారించారు. వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం వేట సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News