: స్టూడెంట్స్ చదువుకోవాలా?...మరి మీరేం చేశారు వెంకయ్యనాయుడు గారూ?: కన్నయ్య సూటి ప్రశ్న
"కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వెంకయ్య నాయుడు గారు...యూనివర్సిటీల్లో విద్యార్థులు చదువుకోవాలని చెబుతున్నారు. బాగుంది. కానీ ఇదే మాట ఓ 30 ఏళ్ల క్రితం ఆయన అమలు చేసి ఉంటే ఇంకా బాగుండేది" అని జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ లీడర్ కన్నయ్య కుమార్ కేంద్రమంత్రిపై సెటైర్ వేశారు. విజయవాడలోని ఐవీ ప్యాలెస్ హోటల్ లో ఆయన మాట్లాడుతూ, ఓ 30 ఏళ్ల క్రితం, వెంకయ్యనాయుడు యూనివర్సిటీలో విద్యార్థి నేతగా ఉండి... ఇప్పుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారని అన్నారు. స్టూడెంట్స్ ఏం చేయాలో చెప్పడం కాకుండా మీరేం చేశారో చెప్పాలని ఆయన సూచించారు. 'మీరు లాబీలు చేసి రాజకీయాల్లో ఉన్నత పదవులు అలంకరించారు. మేము మాత్రం అవసరం కొద్దీ ఇలా పోరాటం చేస్తున్నాం' అని ఆయన వెంకయ్యను విమర్శించారు.