: స్టూడెంట్స్ ను చూస్తే మోదీకి గుండెదడగా ఉంది: సీపీఎం బాబురావు


ప్రధాని నరేంద్ర మోదీకి స్టూడెంట్స్ ను చూసినా, స్టూడెంట్ యూనియన్ లీడర్లను చూసినా గుండెదడ పుడుతోందని విజయవాడ సీపీఎం నేత బాబురావు పేర్కొన్నారు. విజయవాడలో ఐవీ ప్యాలెస్ హోటల్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ జాతీయ నాయకులు కన్నయ్య కుమార్ అంటే వణికిపోతున్నారని అన్నారు. అందుకు కన్నయ్య కుమార్ ఎక్కడికి వెళ్లినా అడ్డుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలకు సూచనలు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే విజయవాడలో ఈ సభను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వాతంత్ర్యపు హక్కును అందరికీ రాజ్యాంగం కల్పించిందని ఆయన గుర్తుచేశారు. బీజేపీ నేతలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. అందుకే కన్నయ్య కుమార్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆందోళన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చెడు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News