: విజయవాడలో కన్నయ్యకు సొంత భద్రత... కర్రలు చేబూనిన వామపక్షాల కార్యకర్తలు!


విజయవాడలో కన్నయ్య కుమార్ బహిరంగ సభకు వామపక్ష కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. ఐవీ ప్యాలెస్ వద్ద కన్నయ్య కుమార్ స్టూడెంట్స్, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో కన్నయ్యను అడ్డుకుని తీరుతామని ఏబీవీపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో రంగంలోకి దిగిన వామపక్ష కార్యకర్తలు కర్రలు ధరించి కన్నయ్య కుమార్ కు రక్షణకు నిలబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ కార్యకర్తలకు దన్నుగా నిలుస్తోందని అన్నారు. ఏబీవీపీ గూండాలు కన్నయ్య కుమార్ పై దాడికి దిగే అవకాశం ఉందని, అటువంటప్పుడు తమ పార్టీ కార్యకర్తలను రక్షించుకోవాల్సిన అవసరం తమకు ఉందని వారు అభిప్రాయపడ్డారు. అందుకే తాము కర్రలు చేతబట్టి రక్షణను చేపట్టామని అన్నారు. తాముగా ఎవరినీ ఇబ్బంది పెట్టమని, అదే సమయంలో తమపై ఎవరైనా దాడులకు దిగితే చూస్తూ ఊరుకోమని వారు స్పష్టం చేశారు. ఏబీవీపీ గూండాల ప్రకటన వల్లే తాము రక్షణ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. కన్నయ్యను హెచ్సీయూలోకి అనుమతించకపోవడం బీజేపీ కుట్రలో భాగమని వారు ఆరోపించారు.

  • Loading...

More Telugu News