: ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: ప్రధాని మోదీ ఆదేశం
ప్రజల ఫిర్యాదుల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో మోదీ మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యమెందుకు జరుగుతుందన్న విషయాన్ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సమస్యలను ఒక నెల లేదా గరిష్ఠంగా రెండు నెలల్లో పరిష్కరించాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు గాను ఇంటర్నెట్ లో ఒక వేదికను తయారు చేయాలని, ప్రభుత్వ విభాగాలన్నీ కలిసి పనిచేయాలని, ఆన్ లైన్ లో వివరాలన్నీ ఆధార్ తో అనుసంధానం చేయాలని మోదీ సూచించారు. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు, రైల్వే, విద్యుత్తు ప్రాజెక్టుల గురించి సంబంధిత అధికారులతో ప్రధాని సమీక్షించారు.