: పెళ్లికూతురుగా ముస్తాబైన శ్రీ‌జ‌.. 'అందమైన పెళ్లికూతురు నా సోద‌రి' అంటూ వ‌రుణ్‌తేజ్ ట్వీట్‌


బెంగళూరులోని చిరంజీవి ఫాం హౌస్‌లో మార్చి 28న మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేదిక ఖ‌రారైనట్లు ఇటీవ‌ల వార్తలొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెడ్ డ్ర‌స్‌లో పెళ్లి కూతురుగా ముస్తాబై చిరున‌వ్వు చిందిస్తోన్న శ్రీజ ఫోటోను ఆమె సోదరుడు వరుణ్‌తేజ్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. వ‌రుణ్‌తేజ్ త‌న ట్వీట్‌లో "అందమైన పెళ్లికూతురు నా సోదరి, పెళ్లి సందడి మొదలైంది" అని పేర్కొన్నారు. శ్రీజ పెళ్లి విషయాన్ని ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయినా, ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. కాగా, త‌న‌ చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్తో శ్రీజ వివాహం జ‌ర‌గ‌నుంది. బెంగళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్లో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటున్నారు. పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ కు మాత్రం హైదరాబాద్లో గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News