: రూ.6,284 కోట్లతో 11 హైవే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
కేంద్ర ప్రభుత్వం తాజాగా 11హైవే ప్రాజెక్టులకి ఆమోద్రముద్ర వేసింది. రూ.6,284 కోట్ల విలువైన 11 హైవే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగనుంది. మొత్తం 453 కిలోమీటర్ల పొడవైన 11 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసినట్లు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవే సెక్రటరీ సంజయ్ మిత్రా పేర్కొన్నారు. కాగా, మరో నాలుగు రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ)లకు కూడా మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసిందని సంజయ్ మిత్రా తెలిపారు. రూ.683 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సేతు భారతం ప్రాజెక్టులో ఆర్ఓబీ భాగమని చెప్పారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.