: మీర‌ట్‌లో గోవుల అదృశ్యంపై బీజేపీ, హిందుత్వ సంస్థల ఆందోళ‌న‌


మీర‌ట్‌లో గోవులు అదృశ్య‌మైన ఘ‌ట‌న స్థానికంగా అల‌జ‌డి రేపింది. బాబా మనోహర్ నాథ్ ఆలయానికి చెందిన నాలుగు గోవులు అదృశ్యం కావ‌డంతో అక్క‌డ‌ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గోవులు అదృశ్యం కావడానికి కారకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, హిందుత్వ సంస్థలు ఆందోళ‌న‌ చేశాయి. గోవులను అప‌హ‌రించిన వారిని నేష‌న‌ల్ సెక్యురిటీ యాక్ట్‌ కింద అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ ఉత్తర ప్రదేశ్ అధ్యక్షుడు ఎల్‌కే బాజ్‌పాయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టే ఇటువంటి ఉదంతాల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని అన్నారు. అదృశ్యమైన గోవులను ఇప్పటికే వధించి ఉంటారని ఆయన అన్నారు. స‌మాజ్‌వాదీ పార్టీ ప్ర‌భుత్వం ఇటువంటి ఘ‌ట‌న‌ల‌పై ఎన్న‌డూ చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో మందిరం వ‌ద్ద భారీగా పోలీసు బ‌ల‌గాలను ఉంచారు.

  • Loading...

More Telugu News