: యూఎస్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో చైనాను వెనక్కి నెట్టేసిన ఇండియా


ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులకు స్వర్గధామం తనేనని ఇండియా మరోసారి నిరూపించుకుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ పెట్టుబడులు తగ్గుతున్న వేళ, అమెరికన్ ఇన్వెస్టర్లు భారత్ లో మరింత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. యూఎస్ ట్రెజరీ విభాగం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అమెరికా విదేశీ పెట్టుబడుల్లో 1.8 శాతం ఇండియాలోనే ఉన్నాయి. చైనాలో యూఎస్ పెట్టుబడి కన్నా ఇదే అధికం. డిసెంబర్ 2015 నాటికి చైనాలో 1.6 శాతం యూఎస్ విదేశీ ఈక్విటీ ఉంది. 2013తో పోలిస్తే, 2015 నాటికి ఇండియాలో అమెరికన్ ఇన్వెస్టర్ల ప్రత్యక్ష పెట్టుబడి 7 బిలియన్ డాలర్ల నుంచి 12 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇదే సమయంలో చైనాలో యూఎస్ ఇన్వెస్టర్ల ప్రత్యక్ష పెట్టుబడులు 12.8 బిలియన్ డాలర్ల నుంచి 11.1 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మొత్తం మీద అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమెరికన్ల పెట్టుబడి 12 శాతం మేరకు తగ్గింది.

  • Loading...

More Telugu News