: అందుకే, నా సినిమాలు నేను చూడను!: బాలీవుడ్ నటి కరీనాకపూర్


తాను నటించిన సినిమాలను చూడనని, అది తనకు ఇష్టముండదని బాలీవుడ్ నటి కరీనాకపూర్ చెప్పింది. ఈ సమాధానంతో ఎందుకు చూడరనే అనుమానం ప్రేక్షకులకు కలుగకమానదు! దానికి కూడా ఆమె సమాధానం చెప్పింది. తాను నటించిన సినిమాలు చూస్తే.. ఆయా సన్నివేశాల్లో ఇంకా బాగా నటించి ఉండాల్సిందన్న భావన కలుగుతుందని, అందుకే, తన సినిమాలు చూసేందుకు ఇష్టపడనని కరీనా కపూర్ చెప్పింది. కరీనా కపూర్ తాజా చిత్రం ‘కీ అండ్ కా’. ఈ చిత్రంలో అర్జున్ కపూర్ సరసన నటిస్తున్న కరీనా మరిన్ని విషయాలు చెప్పింది. తనను తాను తెరపై చూసుకుంటే, కొంత ఉద్వేగానికి గురవుతానని చెప్పింది. తాను నటించిన సినిమాలను తన అమ్మ, అక్కయ్యలు చూస్తారని, ఆయా చిత్రాలలో తాను ఎలా నటించానన్న విషయాన్ని వారు చెబుతారంటూ కరీనా చెప్పుకొచ్చింది. ఎంతో బాగా నటించావంటూ వాళ్లు చెప్పినప్పటికీ, తనకు మాత్రం తృప్తి ఉండదని, ఇంకా బాగా నటించి వుండాల్సిందనిపిస్తుందని, అందుకే, ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావిస్తానని, నేర్చుకునేందుకు ప్రయత్నిస్తానని కరీనా తన మనసులో మాట చెప్పింది.

  • Loading...

More Telugu News