: హెచ్సీయూకు చేరుకున్న కన్నయ్య... వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
హెచ్సీయూ క్యాంపస్ వద్దకు కాసేపటి క్రితం జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ చేరుకున్నాడు. కారులో అక్కడికి చేరుకున్న కన్నయ్యను వెనక్కి వెళ్లిపోవాలంటూ ఏబీవీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. కన్నయ్యతో పాటు రోహిత్ తల్లి, సోదరుడు, సీీపీఐ నారాయణ కూడా ఉన్నారు. కన్నయ్య వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కన్నయ్య వాహనం చుట్టూ రక్షణ వలయంగా మద్దతుదారులు నిల్చున్నారు. కాగా, వర్శిటీ వద్ద విద్యార్థులు, మీడియా ప్రతినిధులు, భారీగా మోహరించిన పోలీసులు ఉన్నారు.