: రాణించిన అలీ... ఆఫ్గన్ టార్గెట్ 143 పరుగులు
న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఇంగ్లండ్, ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ టీ-20 పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో మోయిన్ అలీ మినహా మరెవరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయలేదు. అలీ 33 బంతుల్లో 41 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరునైనా సాధించింది. జోర్డాన్ 18 బంతుల్లో 15, విల్లీ 17 బంతుల్లో 20 పరుగులు చేసి అలీకి అండగా నిలిచారు. మరికాసేపట్లో, 143 పరుగుల విజయ లక్ష్యంతో ఆఫ్గన్ జట్టు బరిలోకి దిగనుంది.