: గవర్నర్ ను కలిసి తాజా పరిస్థితులు వివరించిన చంద్రబాబు!
ఈ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గవర్నర్ దంపతులకు హోలీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన, తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల గురించి వివరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపైనా నరసింహన్ కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. రోజా సస్పెన్షన్ వ్యవహారం, దానిపై కోర్టు కేసు, ప్రివిలేజ్ కమిటీ నివేదిక తదితరాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, గవర్నర్, చంద్రబాబుల మధ్య మర్యాద పూర్వక సమావేశం జరిగిందని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.