: అరేబియా, పాకిస్థాన్‌లలో నా పెట్టుబడులున్నాయి: ముంబయి కోర్టు విచార‌ణ‌లో హెడ్లీ


ముంబై 26/11 దాడులకు సంబంధించి పాక్‌-అమెరికన్‌ ఉగ్రవాది డేవిడ్‌ హెడ్లీని ముంబయి కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తోంది. ఈ సందర్భంగా, అరేబియా, పాకిస్థాన్ దేశాల్లో తాను పెట్టుబడులు పెట్టినట్లు డేవిడ్ హెడ్లీ తెలిపాడు. లష్కరేతో సంబంధాలు ఉన్న విషయం తన భార్యకు తెలుసన్నాడు. మరో లష్కరే ఉగ్రవాది తనావుర్ రాణాతో తనకు పరిచయం ఉన్నట్లు హెడ్లీ అంగీకరించాడు. సుమారు నాలుగు రోజుల పాటు హెడ్లీని విచారించనున్నారు. ముంబయి దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్‌ హెడ్లీ గ‌తంలో న్యాయస్థానం ముందు కొన్ని విష‌యాలు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ముంబై ఎయిర్‌పోర్ట్‌ను టార్గెట్‌ చేసిందని చెప్పాడు.

  • Loading...

More Telugu News