: వేడుకగా హోలీ!... కర్నూలులో టమోటాలతో సందడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు


హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రంగుల పండుగ వేడుకగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రెయిన్ డ్యాన్సుల్లో యువత మునిగి తేలుతోంది. రాయలసీమ ముఖద్వారం కర్నూలులో వైసీపీ ఎమ్మెల్యేలు సందడి చేశారు. విభిన్నంగా టమోటాలతో జరిగిన ఈ వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరితారెడ్డి ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మోహన్ రెడ్డి తన కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి టమోటాను తొక్కుతూ సందడి చేశారు. ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టేసిన ఆయన తన కుర్రకారు అనుచరుల భుజాలపై చేతులేసి చిందులు తొక్కారు. ఇక అదే జిల్లాకు చెందిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కూడా రంగులకు బదులు టమోటాలను విసురుకుంటూ సందడి చేశారు. మహిళలతో కలిసి ఆమె చిన్నపాటి స్టెప్పులేశారు. ఏకంగా ఎమ్మెల్యేలే యువతతో కలిసి చిందులేయడంతో కర్నూలు హోలీ వేడుకలకు కొత్త ఊపు వచ్చింది.

  • Loading...

More Telugu News