: శుక్రవారం... ఆస్ట్రేలియాతో మ్యాచ్... నా చివరి మ్యాచ్ కావచ్చు!: అఫ్రిది


టీ-20 వరల్డ్ కప్ పోటీల్లో సెమీస్ ఆశలను దాదాపు కోల్పోయిన పాక్ జట్టు కెప్టెన్ అఫ్రిది, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని సూచనప్రాయంగా వెల్లడించాడు. ఈ టోర్నమెంటులో భారత్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయిన ఆ జట్టుకు, నాకౌట్ అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఆస్ట్రేలియాపై భారీ తేడాతో గెలిచి, ఇతర జట్లకన్నా మెరుగైన రన్ రేటును కలిగివుండి, అదృష్టం బాగుంటే, పాక్ కు సెమీస్ అవకాశం లభించవచ్చు. ఈ నేపథ్యంలో అఫ్రిది మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం నాడు ఆస్ట్రేలియాతో జరగబోయే పోటీ తనకు చివరి గేమ్ కావచ్చని అన్నాడు. ఇదిలావుండగా, ఈ వరల్డ్ కప్ టీ-20 తరువాత ఆఫ్రిదిని తప్పించనున్నట్టు పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News