: ఏమన్నా అంటే జగన్ కు అనుకూలమంటున్నారు: తలసాని
తాను నిజం మాట్లాడితే తెలుగుదేశం నేతలు తట్టుకోలేకపోతున్నారని, ఏ వ్యాఖ్యలు చేసినా, వైఎస్ జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నానని విమర్శలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కలిసిన మీడియా వారితో మాట్లాడిన ఆయన, ఎవరైనా ఒక్కసారి తనతో పాటు వచ్చి ఏపీ లాబీల్లో పక్కన నిలబడాలని కోరారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంత కోపంతో ఉన్నారో అప్పుడే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. నిజం చెప్పడానికి ఎవరైతే ఏంటని అన్నారు. తెలంగాణలో టీడీపీకి చెందిన ఓ దొరికిపోయిన దొంగ గురించి మాత్రం మాట్లాడదలచుకోవడం లేదని రేవంత్ రెడ్డి పేరును వెల్లడించకుండా ఎద్దేవా చేశారు.