: జగన్... భాదితుల సంఘం అధ్యక్షుడట!
నిజమేనండోయ్... వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడేనట. ఈ మేరకు ప్రకటన చేసింది వేరెవరో కాదు. సాక్షాత్తు జగనే ఈ మేరకు నిన్న ఆసక్తికర ప్రకటన చేశారు. నిన్న అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బయటకు వచ్చిన ఆయనను పలకరించిన మీడియా ప్రతినిధులు... రోజా సస్పెన్షన్ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఆయన వేగంగా స్పందించారు. ‘‘నేను బాధితుల సంఘం అధ్యక్షుడిని. రోజా కేసులో హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు.