: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్...పాక్ భవితవ్యం తేలేది నేడే!
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు భవితవ్యం నేడు తేలిపోనుంది. న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మొహాలీలో మ్యాచ్ ప్రారంభమైంది. ఒక మ్యాచ్ లో విజయం సాధించి, భారత్ తో ఓటమిపాలైన పాకిస్థాన్ భవితవ్యం ఈ మ్యాచ్ ద్వారా తేలిపోనుంది. పాకిస్థాన్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే...టోర్నీ ఆసక్తికరంగా మారనుంది. ఈ గ్రూప్ లోని టాప్ 4 జట్లు చెరోమ్యాచ్ నెగ్గి పాయింట్ల పట్టికలో సమానమవుతాయి. దీంతో రన్ రేట్ కీలకమవుతుంది. అదే సమయంలో పాక్ విజయం సాధిస్తే, రెండు విజయాలతో రెండో స్థానంలో నిలిచి, భారత్, ఆస్ట్రేలియా జట్లకు సవాలు విసురుతుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీలో అద్భుతంగా దూసుకుపోతున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు బ్యాటింగ్ ప్రారంభించారు.