: యాపిల్ ఫోన్ 26,500 కాదు...39,000 రూపాయలు


భారత్, చైనాల్లో మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు యాపిల్ సంస్థ సరికొత్త ధరలతో రంగప్రవేశం చేయనుందన్న వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. నాలుగంగుళాల స్క్రీన్ తో ఐఫోన్ ఎస్ఈ మోడల్ 26,500 రూపాయలతో భారతీయులకు అందుబాటులోకి రానుందంటూ వార్తలు ప్రసారం కావడంతో ఐఫోన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక జేబులో ఐఫోన్ వేసుకోవచ్చని భావించారు. ఇంతలో యాపిల్ కంపెనీ ధరలపై మరో ప్రకటన విడుదల చేసింది. 26,500 రూపాయల (ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే) ధర అమెరికాలో మాత్రమేనని స్పష్టం చేసింది. భారత్ లో ఈ ఫోన్ ధర 39,000 రూపాయలు అని, ఇదే సరసమైన ధర అని ప్రకటించింది. దీంతో యాపిల్ ఐఫోన్ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.

  • Loading...

More Telugu News