: పేలుళ్లకు ముందు అరబిక్ నినాదాలు!... బ్రస్సెల్స్ పేలుళ్లలో11 మంది మృతి
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లోని ఎయిర్ పోర్టులో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న రెండు శక్తిమంతమైన పేలుళ్లలో ప్రాథమిక సమాచారం ప్రకారం 11 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు కూడా సమాచారం. దాడులకు ముందు అక్కడ అరబిక్ భాషలో పలు నినాదాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ బెల్జియం మీడియా పేర్కొంది. మరోవైపు ఎయిర్ పోర్టులో పేలుళ్లు జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఎయిర్ పోర్టు పరిసరాలను జల్లెడ పట్టాయి. ఈ తనిఖీల్లో పేలని బాంబులు కూడా లభించినట్లు సమాచారం. పేలుళ్లు జరిగిన వెంటనే ఎయిర్ పోర్టును మూసేసిన పోలీసులు.. ఎయిర్ పోర్టులోని ప్రయాణికులను బయటకు పంపారు. పేలుళ్లతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది.