: రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ : జమైకా చిరుత బోల్ట్
ఈ ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ వెల్లడించాడు. రియో ఒలింపిక్స్ తన చివరి పోటీ అని, ఈ ఒలింపిక్స్ లో మూడు పతకాలు సాధించడమే తన ముందున్న ప్రస్తుత లక్ష్యమని అన్నాడు. ఈ దిశగా తాను కృషి చేస్తున్నట్లు చెప్పాడు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగానే గతంలో చెప్పిన దాని కంటే ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించానని అన్నాడు. కాగా, 2020 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని గతంలో బోల్ట్ ప్రకటించాడు. అయితే, మరో నాలుగేళ్ల పాటు ఇదే స్థాయిలో పరిగెత్తడం కష్టమని, అందుకే రియో ఒలింపిక్స్ తర్వాత గుడ్ బై చెబుతున్నానని ఇరవై తొమ్మది సంవత్సరాల స్ప్రింటర్ ఉస్సేన్ బోల్ట్ పేర్కొన్నాడు.