: ప్రధాని మోదీతో మెహబూబా ముఫ్తీ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కొద్ది నిమిషాల క్రితం సమావేశమయ్యారు. జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడే అవకాశాలు కనిసిస్తున్నాయి. కాగా, గత ఏడాది మార్చిలో బీజేపీ, పీడీపీ పొత్తుతో జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన పీడీపీ నేత ముఫ్తీ మహ్మద్ సయీద్ అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం అక్కడ గవర్నర్ పరిపాలన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎవరనే విషయమై అనిశ్చితి కొనసాగుతుండటంతో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.