: తాజ్ కృష్ణాలో దేవాన్ష్ బర్త్ డే వేడుకలు!... నారావారిపల్లె, నిమ్మకూరు నుంచి బంధువర్గం హాజరు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మనవడు దేవాన్ష్ తొలి జన్మదిన వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. హైదరాబాదులోని స్టార్ హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ వేడుకలకు పార్టీ నేతలు, అధికారులకు మాత్రం ఆహ్వానం అందలేదు. చంద్రబాబు, ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కుటుంబాలతో పాటు వారి బంధువర్గం కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె, బాలకృష్ణ సొంతూరు నిమ్మకూరుల నుంచి కూడా ఇరు కుటుంబాలకు చెందిన పలువురు బంధువులు ఈ వేడుకలకు వచ్చారు. ఇక దేవాన్ష్ తల్లిదండ్రులు నారా లోకేశ్, బ్రాహ్మణిలకు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ సినీ ప్రముఖులు మంచు లక్ష్మీప్రసన్న, రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన తదితరులు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. స్టార్ హోటల్ లో నిన్న సాయంత్రం ప్రారంభమైన ఈ వేడుకల్లో చిన్న పిల్లలకు ఆటల పోటీలు కూడా నిర్వహించారు. ఈ వేడుకలకు మొత్తం మీద ఓ వెయ్యి మంది హాజరై ఉంటారని సమాచారం.

  • Loading...

More Telugu News