: ‘లైఫ్ మంత్రాస్’ పేరిట సహారా అధినేత అనుభవాలు...బెస్ట్ సెల్లింగ్ బుక్ గా రికార్డు!


డిపాజిటర్లకు డబ్బులు చెల్లించే విషయంలో విఫలమై తీహార్ జైలు ఊచలు లెక్కిస్తున్న సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ రాసిన పుస్తకం ‘లైఫ్ మంత్రాస్’ వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ బుక్ గా రికార్డుకెక్కింది. జీవితంలో తనకు ఎదురైన అనుభవాలు, పరిశీలనలు, ప్రజల దైనందిన విషయాలపై తన అభిప్రాయాలతో సుబ్రతో రాయ్ ఈ పుస్తకాన్ని రాశారు. రూపా పబ్లికేషన్స్ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఈ పుస్తకం... విడుదలైన వెంటనే బెస్ట్ సెల్లింగ్ బుక్స్ జాబితాలోకి ఎక్కేసింది. గడచిన నాలుగు వారాలుగా ఈ పుస్తకం వరల్డ్ టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆన్ లైన్ లోనే కాక ఆఫ్ లైన్ లోనూ సుబ్రతో పుస్తకం హాట్ హాట్ గా అమ్ముడవుతోందని ‘నీల్సన్ బుక్ స్కాన్ సర్వీస్’ సంస్థ వెల్లడించింది. ఇక ఈ పుస్తకం కోసం ఒక్క భారత్ తోనే కాక విదేశాల్లోనూ పుస్తక ప్రియులు ఎగబడుతున్నారట.

  • Loading...

More Telugu News