: ఎస్కే యూనివర్శిటీ రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, వార్డెన్ లను గదిలో బంధించిన విద్యార్థులు
అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ (ఎస్కేయూ)లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భోజనం సరిగ్గా పెట్టడం లేదంటూ, ఆరు గంటలుగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, వార్డెన్ లను విద్యార్థులు గదిలో నిర్బంధించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.