: దిగ్విజయ్ సింగ్ కు మహారాష్ట్ర సీఎం లీగల్ నోటీసులు
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి లీగల్ నోటీసులు అందాయి. తనపై అసత్య ఆరోపణలు చేసిన దిగ్విజయ్ తనకు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తానని ఆ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఫడ్నవీస్ పై దిగ్విజయ్ చేసిన ఆరోపణలు ఏమిటంటే.. ఫడ్నవీసు భార్య పనిచేస్తున్న బ్యాంకులో ఖాతాలు తెరవాల్సిందిగా ఎస్ఆర్ఏ డెవలపర్స్ కు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సంస్థ ఆదేశాలు జారీ చేసింది. వర్లీలోని యాక్సిస్ బ్యాంకులోనే ఖాతా తెరవాలంటూ అధికారిక ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని దిగ్విజయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ, ఫడ్నవీస్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితోనే మహారాష్ట్ర సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. కాగా, ఫడ్నవీస్ భార్య యాక్సిస్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్!